మహిళలు, చిన్నారులను వేధిస్తున్న రక్తహీనత సమస్యను పారద్రోలడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటూందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మచిలీపట్నంలోని శారదానగర్లో నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొన్నారు. చిన్నారులకు అన్నప్రాసన చేసి పోషకాహారాన్ని అందించారు. పలువురు గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.