డిమాండ్లు పరిష్కరించాలని డాక్టర్లు నిరసన

63చూసినవారు
డిమాండ్లు పరిష్కరించాలని డాక్టర్లు నిరసన
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా వైద్యులు మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వద్ద శనివారం శాంతియుతంగా నల్ల రిబ్బన్ నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. డా. శివరామకృష్ణ మాట్లాడుతూ తమకు జిఓ నెంబర్ 85తో అన్యాయం జరుగుతుందని, ఆ జిఓ ప్రకారం పీజీ ఇన్ సర్వీస్ క్వోట పర్సంటేజ్ సగానికి పైగా తగ్గించారని, ఆ జిఓని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్