భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న మచిలీపట్నం ఆర్డీఓ కార్యాలయంలోకి ఆదివారం వర్షపు నీరు ప్రవేశించింది. వర్షపు నీటిలోనే అధికారులు, ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కలెక్టరేట్ లోని పలు కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరుతోంది. ఇందులో ఆర్డీఓ కార్యాలయం ప్రధానంగా ఉంటోంది.