ప్రజా సమస్యల పరిష్కారానికి మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ లో మీ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల నిమిత్తం వారి సమస్యపై ఇచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందించిన అర్జీలను ఆయన స్వీకరించారు.