మచిలీపట్నం: కాలేజీలలో స్టూడెంట్స్ కి భరోసా శక్తి టీం

82చూసినవారు
కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో మహిళల రక్షణ కోసం శక్తి టీం ఏర్పాటు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. శనివారం కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఎస్వీ గంగాధరరావుతో కలిసి శక్తి టీం వాహనాలను ప్రారంభించారు. ఈ శక్తి టీం మహిళలకు రక్షణగా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్