మచిలీపట్నం: చార్జీలు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం

71చూసినవారు
మచిలీపట్నం: చార్జీలు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తాం
దీపం 2 పథకం అమలులో భాగంగా గ్యాస్ పంపిణీ దారులు, డెలివరీ బాయ్స్ అదనపు చార్జీ వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నం కలెక్టరేట్ లో ఆమె మాట్లాడుతూ.. గ్యాస్ వినియోగదారుల నుంచి రసీదులో ముద్రించిన సొమ్మును మాత్రమే వసూలు చేయాలన్నారు. అదనపు సొమ్ము వసూలు చేస్తే వినియోగదారులు టోల్ ఫ్రీ 1967కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్