సకల జనులకు భోగి పండుగ శుభాలు కలిగించాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. సోమవారం మచిలీపట్నంలో భోగి వేడుకల్లో ఆర్టీసీ చైర్మన్ కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. ఈ భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలన్నారు. ఈ సందర్బంగా భోగి మంటలు వేసారు.