కృష్ణా డెల్టా పరిధిలోని రైతులకు రబీ సీజన్ లో సాగునీరు ఇవ్వలేమని, ఆరు తడిపంటలనే సాగు చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. గురువారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటి వరకు కృష్ణానదిలో ఎన్నడూ విధంగా వరద ప్రకాశం బ్యారేజీ కింద ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ పంటకు సమృద్ధిగా సాగునీరు అందించామన్నారు. నవంబర్ 11 తేదీ నాటికి దాదాపు 290 టీఎంసీల నీటిని సరఫరా చేసినట్టు తెలిపారు.