మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. న్యాయమూర్తి అనుమతితో రిమాండ్ లో ఉన్న నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మచిలీపట్నం సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న A2, A4, A5లను ప్రత్యేక పోలీస్ వాహనంలో తాలుకా పీఎస్ కు మంగళవారం తరలించారు. న్యాయవాదుల సమక్షంలో వీరిని విచారించనున్నారు.