సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ హెచ్చరించారు. గురువారం మధ్యాహ్నం మచిలీపట్నంలోని కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో కోడి పందేల నిర్వహణ నిషేధంపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా కోడి పందేలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు.