మచిలీపట్నం: సీఎం హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి

83చూసినవారు
మచిలీపట్నం: సీఎం హామీల అమలుకు చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 2వ తేదీ మచిలీపట్నంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్