స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు జిల్లాలోని పోలీసులకు ఆదివారం ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు అవనిగడ్డ, మచిలీపట్నం, గుడివాడ, పామర్రు, గన్నవరం, పెడన, పెనమలూరు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది రికార్డులు అప్డేట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఒకేరోజు అప్డేట్ కార్యక్రమం జరిగింది.