జి. కొండూరు కమ్యూనిటీహల్లో ఏర్పాటు చేసిన జి. కొండూరు మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఉపాధి హామీ పథకంపై, వ్యవసాయ శాఖ, ఆరోగ్య శాఖ, మరియు పారిశుద్ధ్యం, పశుసంవర్ధక శాఖ, త్రాగునీటి శాఖ మరియు ఇతర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం 7గ్రామాల్లో అభివృద్ధి పనుల నిమిత్తం మండల ప్రజా పరిషత్ నిధులు 19. 00 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.