జి.కొండూరు మండలంలోని ఆత్కూరు గ్రామంలోని సిఎస్ఐ ఎలిమెంటరీ పాఠశాల మూతపడింది. ఇక్కడ పనిచేస్తున్న వరకుమార్ బుధవారం ఉద్యోగవిరమణ చేయడంతో పాఠశాలను అధికారులు మూసివేయడం జరిగింది.ఏళ్ల తరబడి సిఎస్ఐ సంస్థ ఉపాధ్యాయని యామకాలు జరపక పోవడంతో మండలంలో ఒక్కొక్కటిగా పాఠశాలలు మూతపడుతూ వస్తున్నాయి. కనీసం డిప్యుటేషన్ పైన ఉపాధ్యాయులను నియమించడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. ఉపాధ్యాయుల కొరతతో చివరికి పాఠశాలలు మూసివేసి పరిస్థితి నెలకుంది.