రంగస్థల కళాకారుడు, సినీనటుడు మండలంలోని కోడూరు గ్రామం మాజీ సర్పంచ్ వీరంకి వెంకట నరసింహారావు గోదావరి నంది పురస్కారం అందుకున్నారు. రాజమండ్రి ఆనం రోటరీహాలు నందు ఫిలాంత్రోపిక్ సొసైటీవారు శనివారం నిర్వహించిన గోదావరి నంది పురస్కారం - 2021 కార్యక్రమంలో భాగంగా కృష్ణాజిల్లా, జి. కొండూరు మండలం, కోడూరు గ్రామానికి చెందిన కళాకారులు, సామాజికవేత్త వీరంకి వెంకట నరసింహారావుకు ఈ అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ వంగపండు ఉష చేతుల మీదుగా వీరంకి నంది పురస్కారం అందుకున్నారు. నంది పురస్కారం అందుకున్న వీరంకిని కోడూరు గ్రామస్తులు అభినందించారు.