ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమవిందు

2039చూసినవారు
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రేమవిందు
రెడ్డిగూడెం మండల కేంద్రంలో సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా "ఫ్రెండ్స్ సర్వీస్ సొసైటీ" స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో నిరుపేదలైన వారికి 'ప్రేమవిందు' (అన్నదానం) నిర్వహించారు. జూ ఎన్టీఆర్ అభిమానులు మోహన రెడ్డి, వంశీ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు మాతంగి రామారావు, చాట్ల అచ్చియ్య, సంస్థ నిర్వాహకులు విజయ్ కుమార్ చాట్ల పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్