జి. కోడూరు మండలం, కోడూరు గ్రామములో మంగళవారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మండల పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మి తిరుపతమ్మ పాల్గొని స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులతో కలిసి లబ్ధిదారులకు ధ్రువపత్రాలు పంపిణి చేశారు. కుల, మత, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఏంఆర్ఓ రోహిణి దేవి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.