ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన

63చూసినవారు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన
ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంచికచర్ల మండల కేంద్రంలోని రాజ్యలక్ష్మీ గ్యాస్ కంపెనీ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆడశిశువును చెత్తకుండీలో వదిలి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్