వీరులపాడు: గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ

68చూసినవారు
వీరులపాడు: గ్రామాలను అబివృద్ధి బాట పట్టించడానికే పల్లె పండుగ
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం తలపెట్టిన పల్లెపండుగ కార్యక్రమం గ్రామ గ్రామాన వేడుకగా జరిగింది. మంగళవారం వీరులపాడు మండలంలోని జుజ్జూరు, అల్లూరు గ్రామాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ కింద పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేపట్టారు.

సంబంధిత పోస్ట్