నందిగామ: టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం
కృష్ణా జిల్లా నందిగామలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వ్యక్తిగత కారణాల వల్ల పెండ్యాల గ్రామంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాలు దారుణంగా కొట్టుకున్నాయి. టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు వైసీపీ ఎంపీపీ మాలిక్ బషీర్‌తో పాటు 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఎంపీపీ మాలిక్ బషీర్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.