ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. భోగేశ్వర రావు, సిబ్బంది జరిపిన దాడులు శనివారం చేశారు. ముసునూరు మండలం సూరేపల్లి గ్రామమునకు చెందిన చల్లారి ప్రియాంక భర్త దుర్గాప్రసాద్ అను ఆమె వద్ద రెండు లీటర్ల నాటు సారాయిని స్వాధీన చేసుకున్నారు. ఆమె మీద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మస్తానయ్య పేర్కొన్నారు.