నూజివీడు మండలం దేవరగుంట గ్రామంలో ఆదివారం భార్యాభర్తల పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలో స్మశాన వాటికలో పశువులు గడ్డిమేపే విషయంలో జరిగిన ఘర్షణలో గ్రామానికి చెందిన రామారావు అతని భార్యపై ఐదుగురు వ్యక్తులు దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. భార్యాభర్తలిద్దరూ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.