చాట్రాయిలో జ్వరంతో వివాహిత మృతి

78చూసినవారు
చాట్రాయిలో జ్వరంతో వివాహిత మృతి
చాట్రాయి మండలం చనుబండలో జ్వరం తీవ్రతతో విజయవాడలో చికిత్స పొందుతూ కంచు రామ పుల్లమ్మ(40) సోమవారం మృతి చెందారు. గడిచిన వారం రోజు పుల్లమ్మ జ్వరంతో ఇబ్బంది పడుతూ స్థానికంగా వైద్యం చేస్తున్నా తగ్గకపోవడంతో విస్సన్నపేట వైద్యశాలలో చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. భర్త, ఇరువురు కుమార్తెలున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున జ్వరాలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్