నూజివీడు మండలం మీర్జాపురానికి చెందిన మండపాక సుభాష్ చంద్రబోస్, బెజవాడ సాంబశివరావు, పోతురెడ్డి పల్లి గ్రామానికి చెందిన రెడ్డి కౌసల్య, బత్తులవారిగూడేనికి చెందిన అంచెన శివయ్యలను సంవత్సర కాలానికి నూజివీడు తహసీల్దారు ఎదుట బైండోవర్ చేశామని ఎక్సైజ్ సీఐ ఎ. మస్తానయ్య గురువారం తెలిపారు. మళ్లీ నేరాలకు పాల్పడితే వారికి రూ. లక్ష జరిమానా, ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించారు.