నూజివీడు ఎక్సైజ్ శాఖ పరిధిలోని ముసునూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామంలో ఆదివారం సారా తయారి కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అనగానే చందర్రావు, అనగానే వెంకటేశ్వరరావులు వర్ధ నుండి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ సిఐ మస్తానయ్య తెలిపారు. 800 లీటర్ల బెల్లం బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లుగా తెలిపారు.