ముసునూరులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

78చూసినవారు
గతం ప్రభుత్వ హయాంలో నిర్మించిన జగనన్న కాలనీలో వసతులపై మంగళవారం ఏలూరు జిల్లా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డి ఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముసునూరు మండలంలోని రమణక్కపేట, లోపూడి గుడిపాడు, చింతలవల్లి గ్రామాల్లోని జగనన్న కాలనీలో వసతులు, లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గత ప్రభుత్వంలో అధికారులు తమపై కేసులు పెట్టారని విజిలెన్స్ అధికారులకు మొరపెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్