రాష్ట్ర రగ్బీ పోటీలకు ఎంపికైన జమిదగ్గుమిల్లి విద్యార్థులు

72చూసినవారు
రాష్ట్ర రగ్బీ పోటీలకు ఎంపికైన జమిదగ్గుమిల్లి విద్యార్థులు
కృష్ణాజిల్లా పామర్రు మండలం జమీదగ్గుమిల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తంగిరాల హను ప్రసాద్ శనివారం తెలిపారు. అండర్ 17 విభాగంలో సుష్మా మైత్రి, శివనందిని, అలాగే అండర్ 14 విభాగంలో లంకపల్లి. హనీ, ఈశ్వర్లు ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఈ సందర్భంగా వీరికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ బాదర్ల. రాముని అభినందించారు.

సంబంధిత పోస్ట్