పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో గురువారం రాత్రి అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్ లో సుమారు 100 ట్రాక్టర్లకు పైగా డంపింగ్ చేసిన ఉచిత ఇసుకని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఉయ్యూరు ఆర్డిఓ షారోన్ ఉచిత ఇసుకని డబ్బు చేశారని సమాచారం అందిన వెంటనే అభినందన రియల్ ఎస్టేట్ వెంచర్ వద్దకు వెళ్లడంతో అక్కడ నుంచి డ్రైవర్లు ట్రాక్టర్లుతో సహా పరారు అయ్యారు. ఇసుక ఎవరిదని అని రెవెన్యూ అధికారులు ఆరాతీస్తున్నారు.