ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు ఇసుకను ఉచితంగా అందజేయాలనే ఆలోచనతో మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ అది సామాన్య ప్రజలకు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోట్లవల్లూరు మండలంలోని ఇసుక ర్యాంపులో ఒక ట్రాక్టర్ కు 500 రూపాయలు వసూలు చేయగా అది ప్రజలకు చేరేసరికి 2500 నుండి 3000 వరకు ధర పలుకుంతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు ఇటు ప్రజలకు ఉచిత ఇసుక దక్కడం లేదని నిరుత్సాహపడుతున్నారు