రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తోట్లవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న గురుమూర్తి మాట్లాడుతూ సదస్సుల ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు.