రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా మండల కేంద్రమైన తోట్లవల్లూరుకి చెందిన వీరంకి వెంకట గురుమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా గురుమూర్తి పేరును ప్రకటించింది. గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన గురుమూర్తి గతంలో తోట్లవల్లూరు మండల పరిషత్ అధ్యక్షులుగా, జడ్పిటిసి సభ్యులుగా, తోట్లవల్లూరు పిఎసిఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు.