పమిడిముక్కల మండలం అలినకీపాలెం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మీర్జా మహమ్మద్ అలీ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందారు. 1983 నుంచి పార్టీకి అంకిత భావంతో పని చేస్తూ ప్రజాసేవలో పాల్గొన్న ఆయన స్ఫూర్తిదాయక నేతగా గుర్తింపు పొందారు. ఈ మేరకు ఏపీ మైనార్టీ సెల్ మెంబర్ గా, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడిగా, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా సుదీర్ఘకాలంగా పని చేశారు.