సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజా చిత్రం విడుదల సందర్భంగా ఆదివారం పామర్రు పట్టణంలో బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. చిత్రం విడుదల సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడ మచిలీపట్నం ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా అభిమానులను ప్రోత్సహించటంతో సందడి వాతావరణం మరింత రెట్టింపు అయింది.