పెదపారుపూడి మండలంలోని ఎలమర్రు ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అనిత జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి మంగళవారం తెలిపారు. డిసెంబర్ 25 నుంచి 29వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ లోఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ జూనియర్ ఖోఖో పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. అనితకి శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు సోమేశ్వరరావుని ప్రత్యేకంగా అభినందించారు.