ఉయ్యూరు: కాలువలో మృతదేహం కలకలం

80చూసినవారు
ఉయ్యూరు: కాలువలో మృతదేహం కలకలం
ఉయ్యూరులో ఒక మంగళవారం కాలువలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎస్సై విశ్వనాథ్ తెలిపిన వివరాల మేరకు  ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడికి వెళ్లి పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 మధ్యలో ఉంటుందని తెలిపారు మృతుడి వివరాలు ఎవరికైనా తెలిసుంటే సమాచారం ఇవ్వాలని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్