అందరూ సామరస్యంగా ఉండాలి: హిందువులు

73చూసినవారు
పెడన పట్టణంలో ఈనెల 16వ తేదీన జరిగిన సంఘటన నేపథ్యంలో 7వ వార్డ్ కౌన్సిలర్ కటకం ప్రసాద్ హిందూ కుల పెద్దలతో కలిసి సోమవారం వివరణ ఇచ్చారు. 16వ తారీకు ముందు మతభేదం, వర్గ బేధం లేకుండా హిందూ ముస్లిం అందరూ ఎంతో సోదర భావంగా సామరస్యంగా కలిసి ఉన్నామన్నారు. కొంతమంది అసాంఘిక శక్తులు మతకల్లోలాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలలో అవాస్తవాలను ప్రచురితం చేస్తున్నారని అందరూ సామరస్యంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్