బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బుక్ కీపర్ బొమ్మిడి భువనేశ్వరి గ్రామంలోని గ్రామైక్య సంఘానికి చెందిన లక్ష రూపాయలు నగదు ఫోర్జరీ సంతకాలతో డ్రా చేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం న్యాయం చేయాలని ఆందోళన చేశారు. గతంలో పనిచేసిన మండల ఏపిఎం శ్రీనివాస్ తో కలిసి బుక్ కీపర్ భువనేశ్వరి ఫోర్జరీ సంతకాలు చేసి గ్రామైక్య సంఘంలోని వివో ఎకౌంటు నుంచి డబ్బులు డ్రా చేశారని నిరసన తెలియజేశారు