కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ శనివారం ఉదయం పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజు పాలెం గ్రామ పరిధిలో ఈ- పంట నమోదు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ పంట నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో త్వరగా చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన సూచించారు. రైతులు పండించిన ధాన్యం విక్రయాలకు ఈ పంట నమోదు తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.