గూడూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

79చూసినవారు
గూడూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ డి. రాజలక్ష్మి తెలిపారు. బుధవారం పెడన నియోజకవర్గం గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ, ధాన్యంలో తేమ శాతం 17 కన్నా తక్కువ ఉండాలని, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన, ఐదు శాతం కన్నా ఎక్కువ ఉండరాదన్నారు. క్వింటా ధర రూ. 2300, ఏ గ్రేడ్ రకం రూ. 2320 నిర్ణయించినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్