పెడన మండలం కూడూరు పంచాయతీ పరిధిలో విద్యుద్దీకరణ పనులు శుక్రవారం ప్రారంభించారు. శివారు గ్రామం కృష్ణాపురం కాలనీలో లక్ష రూపాయల నిధులతో ఈ పనులు జరుగుతున్నాయి. అవసరమైన చోట కొత్తగా స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఈ పనులను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కాగిత విజయలక్ష్మి శ్రీహరి తెలిపారు. నూతన స్తంభాలు ఏర్పాటు చేయడం పట్ల ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.