పెడన మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏ సమయంలో అందుబాటులో ఉంటారో తెలియటం లేదని గురువారం రైతులు పేర్కొన్నారు. ఉదయం 11 దాటిన కార్యాలయానికి వేసి ఉన్న తాళాలు తెరుచుకోకపోవడంతో వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన రైతులు వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొనట్లు తెలిపారు. తమ సమస్యలను ఫోను ద్వారానైనా వ్యవసాయ శాఖ అధికారికి తెలుపుదామంటే కనీసం మొబైల్ కి కూడా సమాధానం ఇవ్వటం లేదని రైతులు మండిపడుతున్నారు.