పెడన పట్టణంలోని పైడమ్మ కాలనీలోని ప్రజలు నిత్యం భయం గుప్పెట్లో జీవించాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద వైర్లు వేలాడుతూ ఉన్నాయని, ఒక్కొక్క సారి ఆ బోర్డు నుంచి పొగలు వస్తుండటంతో భయబ్రాంతులకు లోనవుతున్నామన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు బుధవారం కోరారు.