పెడన పట్టణంలో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ కటకం నాగకుమారి వరప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం కార్యాలయంలో ఆయన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ నెలలో జరిగే పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం, క్రిస్మస్ వేడుకల సందర్భంగా శానిటేషన్ పనులను నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.