పెడన నియోజకవర్గంలో విద్యుత్ చార్జీల బాదుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించిందన్నారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రమేష్ (రాము) పెడన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి పెడన విద్యుత్ కార్యాలయం వరకు భారీ నిరసన శాంతియుత ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ విద్యుత్ కార్యాలయంలో ఏఈకి వినతిపత్రం అందజేశారు.