పెడనలోని బి. జి. కే జెడ్పిహెచ్ స్కూల్లో విద్యార్థులకు సరైన త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర సెక్రటరీ బంగారు రాము అన్నారు. ఆదివారం పెడనలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ కు ఈ వినతి పత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు.