బంటుమిల్లి మండలంలో నీట మునిగిన పంట పొలాలు

65చూసినవారు
శనివారం తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ భారీ వర్షాల కారణంగా నీటముగాయి. ఎన్నో ప్రయాసలను ఎదుర్కొని వరి నాట్లు వేస్తే అవి పూర్తిగా నీట మునగటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

సంబంధిత పోస్ట్