ఘనంగా అహ్మదీయ జమాత్ యువకుల మరియు బాలల వార్షిక సమావేశం

256చూసినవారు
ఘనంగా అహ్మదీయ జమాత్ యువకుల మరియు బాలల వార్షిక సమావేశం
కంకిపాడు మండలం, కుందేరు గ్రామంలో స్థానిక మస్జిద్ నూర్ నందు ఆదివారం రోజున ఆహ్మదీయ ముస్లిం జమాత్ కృష్ణాజిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం సాహెబ్ అధ్యక్షతన జిల్లా యువజన సమితి 7 వ వార్షిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువజన సమితి జిల్లా అధ్యక్షులు షేక్ నాగూర్ మీరావాలి మరియు షేక్ బాపూజీ సాహెబ్ షేక్ జాకీర్ హుస్సేన్ మరియు జిల్లా ఇంచార్జ్ ఉస్మాన్ సాహెబ్ మహమ్మద్ ఇస్మాయిల్ సాబ్ యాకుబ్ పాషా పాల్గొని ప్రసంగించారు. షేక్ నాగూర్ మీరావాలి ప్రసంగిస్తూ యువకుల సంస్కరణ కానిదే జాతుల సంస్కరణ సాధ్యం కాదని తెలిపారు. షేక్ జాకిర్ హుస్సేన్ మాట్లాడుతూ ధార్మికంగా ప్రాపంచికంగా ఎదగాలని మరియు సమాజ సేవలో ముందుండాలని బోధించారు.

ఈ కార్యక్రమంలో ధార్మికపరమైన విషయాలలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన యువకులకు బాలలకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు షేక్ మహబూబ్ సుభాని , లాల్ అహ్మద్, సైదులు షేక్ సిలార్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్