పెనమలూరు: మద్దూరులో అక్రమ నిర్మాణం నిలిపివేత

56చూసినవారు
పెనమలూరు: మద్దూరులో అక్రమ నిర్మాణం నిలిపివేత
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామంలోని కనకదుర్గాపురంలో ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంను శుక్రవారం నిలుపుదల చేశారు. నిర్మాణం చేస్తున్న పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావుకు నోటీసు జారీ చేశామని గ్రామ కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు. తమ సొంత అవసరాలకే నిర్మాణం చేపట్టామని, చర్చి కోసం నిర్మాణం కాదని వెంకటేశ్వరరావు వ్రాత పూర్వకంగా తెలిపినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్