ఏపీలో ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు రాష్ట్ర సమాచార పోర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయం ప్రకటన విధులు చేసింది. ఈనెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారని తెలిపారు.