దీప్లానగర్ తండాలో పర్యటించిన జిల్లా కలెక్టర్ జి. సృజన

59చూసినవారు
కృష్ణా జలాలను పంపిణీ చేయడమే కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారమని జిల్లా కలెక్టర్ సృజనా అన్నారు. బుధవారం తిరువూరు ఏ కొండూరు మండలంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కిడ్నీ వ్యాధితో సుమారు 216మంది బాధపడుతున్నారని అలాగే 25మంది డయాలసిస్ చేసుకుంటున్నారని, మరొకసారి నాలుగు మండలాల్లో కిడ్నీబాధితులుజాబితాను సర్వే చేయిస్తామని కలెక్టర్ సృజన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్